రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
వరంగల్ ఈస్ట్, నవంబర్ 28(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 29న సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు జాగర్లపూడి శ్రీరామ్ శర్మ తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు అలాగే ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో కమల తెలిపారు




