బెల్లంపల్లి, ఏప్రిల్ 28, (జనంసాక్షి )నేతకానీ రక్షణ సంఘం హన్మకొండ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకొనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర శ్రీనివాస్ తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నేతకానీ కుల సమస్యలపై చర్చించి, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా పోస్ట్ కార్డు ఉద్యమంతో కదం తొక్కుదామని పిలుపునిచ్చారు. నేతకానీల కోసం ధర్మ యుద్ధం. నేతకానీలు సిద్ధం అనే నినాదంతో ముందుకు కదులుదాం అన్నారు.




