రేవంత్‌ ఓ చిల్లర రాజకీయనేత

ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ
సోనియాను తిట్టిపోసి..ఇప్పుడు తల్లి అంటున్నాడు
డబ్బులు పెట్టి పిసిసి పదవి తెచ్చుకున్న ఘనుడు
సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రతినిధి రేవంత్‌
రేవంత్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ కనుమరుగు తప్పదు
కెసిఆర్‌పై పోరాడేందుకే బిజెపిలో చేరాను
రేవంత్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రాజగగోపాల్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఆగస్ట్‌3(ఆర్‌ఎన్‌ఎ): పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఓ బ్లాక్మెయిలర్‌ అని, టిడిపి నుంచి వచ్చి సీటు కొనుక్కున వ్యక్తి వల్ల కాంగ్రెస్‌ బతికి బట్టకట్టదని, నాలుగు పార్టీలు మారిన వ్యక్తా తన విూద విమర్శలు చేసేది అని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ అడుగు కూడా ముందుకు కదలదని అన్నారు.రాజీనామాచేయడంతో రేవంత్‌ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్‌ రెడ్డి తీవ్రంగా ఖండిరచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నోరు తెరిస్తే సోనియా తల్లి అని మాట్లాడుతున్న రేవంత్‌… ఆనాడు సోనియాను బలిదేవత అని నిందించలేదా అని ప్రశ్నించారు. 20 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీని ఇష్టమొచ్చినట్లు తిట్లి ఇవాళ… తాను సోనియా గాంధీని అవమానించారని అనడం సరికాదన్నారు. అక్రమంగా కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చి ఇవాళ… పార్టీని నాశనం చేయడానికి రేవంత్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొడంగల్‌ లో ఓడిస్తే… చావు తప్పి కండ్లు లొట్టలు పోయిన చందంగా మల్కాజిగిరిలో గెలిచారని రేవంత్‌ పై మండిపడ్డారు. అలాంటి వ్యక్తి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరునేదిలేదని హెచ్చరించారు. మంచి మిత్రుడని చెబుతూనే వ్యాపారాల కోసం అమ్ముడు పోయనట్లు రేవంత్‌ తనను విమర్శిస్తున్నారని… ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్‌ రెడ్డి అంటూ విరుచుకు పడ్డారు. పార్టీ కోసం ఎంతో త్యాగం చేశానని, టీఆర్‌ఎస్‌ అధికారాన్ని దించడానికే తాను కాంగ్రెస్‌ నుంచి బయటికి వెళ్లిపోతన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తనకు కాంట్రాక్టు ఇచ్చిందని రేవంత్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. డబ్బు కోసమే తాను బీజేపీలోకి చేరుతున్నట్లు దుష్పచ్రారం చేస్తున్నారన్న ఆయన..డబ్బు కోసమే బీజేపీకి వెళ్తున్నానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన అన్నారు. ఒకవేళ నిరూపించకపోతే రేవంత్‌ తన పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని సవాలు విసిరారు. తనకు దక్కిన టెండర్‌ ఓపెన్‌ టెండర్లలో భాగంగానే వచ్చింది కానీ మరేవిూ కాదన్నారు. రేవంత్‌ నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లడుతున్నారన్న ఆయన… ఒక కులాన్ని పొగడుతూ మిగతా
కులాలను రేవంత్‌ కించపరిచారని ఆరోపించారు. తాను రేవంత్‌ కు పీసీసీ అధ్యక్షుడి పదవి ఇవ్వాలని చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం లేదన్నారు. అసలు ఆయన ఎప్పుడూ తన ఇంటికి రాలేదని తెలిపారు. కాంగ్రెస్‌ తన గుత్తాధిపత్యం అయినట్లు రేవంత్‌ వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. తనను పండబెట్టి తొక్కుతా అని రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారన్న ఆయన.. మూడు ఫీట్లు ఉన్న రేవంతా తనను తొక్కేది అంటూ ఫైర్‌ అయ్యారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. తాను ఎక్కడికిపోయిన సీఎం సీఎం అంటూ సొంత డబ్బా కొట్టించుకుంటారని ఆరోపించారు. తమ బ్రాండ్‌ గురించి మాట్లాడే అర్హత రేవంత్‌ కు లేదన్న ఆయన… అలాంటి చిల్లర వ్యక్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. హుజురాబాద్‌లో ప్రచారం చేస్తే మూడు వేల ఓట్లు కూడా సాధించలేకపోయారని విమర్శించారు. తనది కాంగ్రెస్‌ రక్తం కాదని, అవకాశ రాజకీయాలు చేస్తున్నారని రేవంత్‌ పై రాజగోపాల్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్‌ రెడ్డి వెనుక ఉన్నది చంద్రబాబు, సీమాంధ్ర పెట్టుబడి దారులని అన్నారు. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అసలే గెలవదన్న ఆయన… ఆత్మ గౌరవమున్న తనలాంటి నాయకులు పార్టీ నుంచి బయటికి పోతన్నట్లు చెప్పారు. రేవంత్‌ రెడ్డి లాంటి చిల్లర వ్యక్తుల ఆధ్వర్యంలో పనిచేసేదిలేదని స్పష్టం చేశారు. అందుకే కేసీఆర్‌ కు వ్యతిరేకంగా పోరాడేందుకు… మోడీ, అమిత్‌ షా నాయకత్వంలో పని చేయనున్నట్లు స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌ కు డిపాజిట్‌ కూడా రాదని రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ లో ఎవరూ సంతోషంగా లేరన్న ఆయన… తన దిష్టి బొమ్మలు దగలబెట్టాలని చెప్పిన వాళ్లు ఎమ్మెల్యేగా గెలిచారా అని ప్రశ్నించారు. సంబరాలు చేసినవారికి మొన్న హుజురాబాద్‌ లో ఎన్ని ఓట్లు వచ్చాయో చూడాలన్నారు. మునుగోడు ప్రజలే రేవంత్‌ కు బుద్ది చెబుతారని రాజగోపాల్‌ రెడ్డి హెచ్చరించారు.