రేవంత్ కు విషం తప్ప  విజన్ లేదు

 

రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్

TSHDC ఛైర్మెన్ చింతా ప్రభాకర్సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి, జూలై 11 :రైతులకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీనేనని TSHDC ఛైర్మెన్ చింతా ప్రభాకర్ అన్నారు.రైతులంటే రేవంత్‌రెడ్డికి ఎందుకంత ద్వేషం అంటూ అయన  మండిపడ్డారు.రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చింతా ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు.ముఖ్యమంత్రి గత తొమ్మిది సంవత్సరాల్లో రైతులకు అండగా ఉంటూ రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే కాంగ్రెస్‌కు ఏడుపెందుకన్నారు.తెలంగాణ వచ్చాక కరెంట్‌ కోతలు తప్పాయని,  రైతులు ఆనందంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.రైతుల పట్ల రేవంత్ కున్న రాక్షసత్వం  ఏమిటో  ఈ వ్యాఖ్యల ద్వారా  తేలిపోయిందని దీనిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.రేవంత్ కు విషం తప్ప  విజన్ లేదన్నారు.రాహుల్ కు రాజకీయాల మీద  అవగాహన  ఉంటె  ఇలాంటి  దొంగ కు  పీసీసీ పగ్గాలిస్తారా అని ఆయన మండిపడ్డారు.రాహుల్  ,ఖర్గే ,సోనియా లు రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

తాజావార్తలు