సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు
రామారెడ్డి జూలై 12 జనంసాక్షి
సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా రామారెడ్డి జెడ్పిటిసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత విద్యుత్ ఉచిత వైద్య సేవలు ఉచిత విద్యా విధానం అందించిందని గుర్తు చేశారు అప్పులు చేసిన తెలంగాణ గారడి చేస్తున్న సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఏ రైతుకు ఇస్తున్నాడో తెల్చీ చెప్పాలని ప్రశ్నించారు. రామారెడ్డి మండలంలో ఎక్కడ చూసినా అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కనిపిస్తున్నాయని ఎదవ చేశారు దమ్ము ధైర్యం ఉంటే టిఆర్ఎస్ నాయకులు మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి ఏర్పాటు చేయాలని అన్నారు. మన ఊరు మనబడి కింద పాత గోడలు తెల్ల సున్నం అన్నట్లుగా విద్య వ్యవస్థ దాపురించిందని అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి వసతి, ఎక్కడ కనిపిస్తున్నాయో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలన్నారు. ప్రెస్ మీట్ లు పెట్టుకుని చేయని పనుల గురించి తమ గొప్పలు చెప్పుకోవడం కాదు, అన్ని రంగాల్లో గ్రామాల్లో అభివృద్ధి చేసి చూపించాలని హితవు పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ శివయాత్రలో భాగంగా దింపుడు కళ్ళం చేపట్టి చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు . అనంతరం పంచాయతీ కార్మిక సిబ్బంది నిరోధిక సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పోసానిపేట్ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి , సీనియర్ నాయకులు , వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు