రేవంత్ రెడ్డిని కలిసిన భూక్యా దళ్ సింగ్ నాయక్
టేకులపల్లి, నవంబర్ 29( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని తన నివాసంలో టేకులపల్లి మండలానికి చెందిన సీనియర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఇల్లందు నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న భూక్యా దళ్ సింగ్ నాయక్ మర్యాదపూర్వకంగా సోమవారం రాత్రి కలిశారు. ఇల్లందు నియోజకవర్గంలో గత ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పనితీరుపై, కాంగ్రెస్ కార్యకర్తల ఓటు బ్యాంకు పై, గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థులే శాసన సభ్యులుగా గెలిచినప్పటికీ అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న తీరును ఆయన వివరించారు. గెలిచిన ఇద్దరు శాసనసభ్యులు రెండు పర్యాయాలు అధికార పార్టీలో చేరినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని ఆయన వివరించారు. తిరిగి ఇల్లందులో మరోసారి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని నాయకులు కార్యకర్తలు కృతనిచ్చేయంతో ఉన్నారని ఆయన తెలిపారు. ఇల్లందు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని పర్యటించాలని ఆయన కోరారు. దీంతో రేవంత్ రెడ్డి కచ్చితంగా పర్యటిస్తానని సానుకూలంగా స్పందించినట్లు దళి సింగ్ నాయక్ తెలిపారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఆయనతోపాటు లక్కినేని సాయి కృష్ణ, స్థానిక నాయకులు ఉన్నారని తెలిపారు.




