Thursday, 5 November 2026

విచ్ఛిన్నకారుల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి

విచ్ఛిన్నకారుల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి..

కవి,గాయకులు దేశపతి శ్రీనివాస్

హన్మకొండ బ్యూరో చీఫ్ 29 నవంబర్ జనంసాక్షి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి నేటితో 13 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విఫ్,వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ ఆధ్వర్యంలో కాళోజి సెంటర్ వద్ద దీక్ష దివాస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కవి,గాయకులు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ సారధ్యంలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్న శక్తుల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు,పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే ప్రగతిపథంలో పయనిస్తుంటే అది గిట్టని కేంద్రం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ అణచివేయ చూస్తుందని ఆయన విమర్శించారు. చైతన్యానికి నెలవైన తెలంగాణలో మతోన్మాదుల ఆటలు సాగవని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ ఆమరణ దీక్ష సబ్బండ వర్గాలను ఏకం చేసి ఉద్యమానికి ఊతమిచ్చిందన్న ఆయన తెలంగాణ పోరాటంలోనే కేసీఆర్ దీక్ష ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.ఓరుగల్లు కేంద్రంగా సీమాంధ్రుల కుట్రలకు వ్యతిరేకంగా శాసన సభ్యుడిగా పోరాడిన చరిత్ర దాస్యం వినయ్ భాస్కర్ కే దక్కుతుందన్నారు,ఉద్యమకాలంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ మరియు కాకతీయ ఉత్సవాల సందర్భంగా నిరసనల రూపంలో ఆయన ప్రదర్శించిన ధైర్య,సాహసాలు వెలకట్టలేనివని ఆయన కొనియాడారు.ఉద్యమంలో ఓరుగల్లు కేసీఆర్ వెన్నంటి నడవడమే కాక ఎన్నో ఉద్యమ రూపాలకు ఆయువు పోసిందన్నారు,ప్రజాకవి కాళోజీ,తెలంగాణ స్వాప్నికుడు జయశంకర్, దాశరథి మరియు బమ్మెర పోతనలు జన్మించిన నేల ఓరుగల్లు అని కొనియాడారు,కాకతీయుల సౌర్యం, సమ్మక్క-సారలమ్మల ధైర్యం ఓరుగల్లు సొంతం అన్నారు. అట్లాంటి ఓరుగల్లు గడ్డ మీద మళ్ళీ ఉద్యమ జ్ఞాపకాలను స్ఫురించుకోవడం అభినందనీయమన్నారు. చరిత్రను వర్తమానంలో నెమరువేసుకోకపోతే చరిత్రకు గమ్యం ఉండదని దేశపతి అన్నారు. తెలంగాణ ఎక్కడిది అన్నాకాడి నుండి శాసించి గాంధీయిజ పంథాలో నేడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని అనేకనేక సమస్యలకు అతి కొద్ది కాలంలోనే పరిష్కారం చేసుకోవడం జరిగిందన్నారు. వేలాది త్యాగలతో,అమరవీరుల రక్తంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విచిన్న మతతత్వ శక్తులు మళ్ళీ రక్తం పారించాలని కుట్రలు చేస్తున్నాయి అట్లాంటి శక్తులకు దయచేసి ఆ ప్రయత్నాలు మానుకోవాలని రెండు చేతులు జోడించి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు…

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ భాస్కర్ మాట్లాడుతూ కేసీఆర్ స్పూర్తితోనే తెలంగాణ ఉద్యమంలో తాను తెగించి పోరాడానని తెలిపారు, ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్న ఆయన తన వెంట కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రముఖ ఆర్థిక నిపుణుడు, ప్రొఫెసర్ పాపారావు మాట్లాడుతూ తాను ఆంధ్రా ప్రాంతం వాడినైన తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతు తెలపానని నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పలు కేంద్ర రంగ సంస్థలను అమ్మేస్తూ ప్రయివేటు రంగానికి కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. అహింస సిద్ధాంతంతో గాంధేయ మార్గంలో నడిచిన తెలంగాణ ఉద్యమం దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని ఆయన అన్నారు…

ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి,కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్,గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్,మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి,పలు డివిజన్ల కార్పొరేటర్లు, అధ్యక్షులు,మాజీ కార్పొరేటర్లు,కార్యవర్గ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు,TRSV విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు…