రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

 

భైంసా రూరల్ జూలై 12 జనం సాక్షి: నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రం భగ్గుమన్నది.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగింది… టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులపై చేసిన వ్యాఖ్య లపై నిరసన వ్యక్తపరిచారు.. స్థానిక శివాజీ చౌక్ వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వం దేనిని , రైతులకు మూడు గంటల విద్యుత్తు చాలు అని అనడం ఎంతవరకు సమంజసం అని, ప్రగతి భవన్ ను కూల్చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు.. వెంటనే రైతులపై చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని లేని యెడల తెలంగాణ లోని రైతులు కాంగ్రెస్ కు పుట్టగతులు లేకుండా చేస్తారని, రాబోయే ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గం లో విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ జెండాను ఎగరేసి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని జోష్యం చెప్పారు.. సుమారు గంటపాటు నిజామాబాద్-బైంసా ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణరావు, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొర్వ శ్యామ్, స్థానిక నాయకులు జ్ఞాని పటేల్, నూకం రామారావు, బాల మల్కన్న, ఖలీల్,ఫసియుద్ధిన్, కృష్ణ పాల్గొన్నారు.

తాజావార్తలు