రైతుల శ్రేయస్సు కోసం మార్కెట్ కమిటీలు- తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూలై 12 : సదాశివపేట మార్కెట్ యార్డుల్లో రైతులకు బాధ్యత మార్కెట్ కమిటీ పై ఉందని, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు.బుధవారం సదాశివపేటలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో సదాశివపేట మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణా చేనేత కార్పోరేషన్ చేర్మెన్ చింత ప్రభాకర్, మాట్లాడుతూ మార్కెట్ కమిటీ రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. జిల్లాలోనే సదాశివపేట మార్కెట్ ఒక మాడల్ మార్కెట్ గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. స్వరాష్ట్రంలో రైతుల ముఖచిత్రం మారిందన్నారు. సీఎం పాలనలో దేశంలో ఎక్కలేని విధంగా రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని, రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు. సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సడకుల .కృపా కుమార్,వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్లు కుమార్ గౌడ్,అమరేందర్ రెడ్డి, కరుణాకర్, విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, ఎంపీపీలు మనోజ్ రెడ్డి, యాదమ్మ, గ్రంధాలయ చైర్మన్ నరహరి రెడ్డి డిసిసిబి ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు పట్నం మాణిక్యం సీడీసిచెర్మెన్ కాసాల బుచ్చిరెడ్డి సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ చిదురుప్ప ప్రభు గౌడ్ ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు పవన్ కుమార్, రాజు, రైతుబంధు అధ్యక్షులు మల్లేశం, మండల అధ్యక్షులు విట్టల్, ఆంజనేయులు,కౌన్సిలర్లు పులిమామిడి రాజు, పిల్లోడి విశ్వనాథం, పాండురంగం, గోవర్ధన్ రెడ్డి, మల్ల గౌడ్ సర్పంచులు మార్కెటింగ్ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.