రేషన్ డీలర్ ఆటో కృష్ణకు ఆర్థిక సహాయం
టేకులపల్లి,నవంబర్ 28( జనం సాక్షి): కొత్త గూడెం టౌన్ రేషన్ డీలర్ ఆటో క్రిష్ణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. తోటి రేషన్ డీలర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తరుపున సోమవారం వైద్యశాలలో కృష్ణ ను పరామర్శించి పదివేల రూపాయలను ఆర్థిక సాయంగా అందించారు . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఊకే శేఖర్‌రావు, పాయం పాపయ్య, భద్రాచలం డవిజన్ అద్యక్షుడు పి.శ్రీనివాసరావు, ఆంగోతు సంతూలాల్, పద్మ, బాలు, రాందాస్ బాలాజీ, ప్రభాకర్తదితరులు పాల్గొన్నారు.




