Saturday, 7 November 2026

132వ మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి.

132వ మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి.

నివాళులర్పించిన ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్.

జనం సాక్షి ఉట్నూర్.

ఉట్నూర్ పట్టణంలో తెరాస పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పులే 132వ జయంతి నిర్వహించి ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్ జయంతిలో పాల్గొని మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రేఖ నాయక్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ఉద్దారణకు ఎంతో కృషి చేశారని ప్రజలకు సమాన హక్కులను సమాజంలోని అన్ని కులాల హక్కులను పొందడానికి అభ్యున్నతి కోసం మహాత్మ జ్యోతిరావు పూలే సమాజానికి చేసినటువంటి సేవల్లో భారతదేశ మొదటి సంఘ సంస్కర్తగా జ్యోతిరావు పూలే నిలిచారని ఆనాటి మహనీయుల త్యాగాలను గుర్తించి వారి అడుగుజాడల్లో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ మండల అధ్యక్షుడు కందుకూరి రమేష్ మండల కో ఆప్షన్ నెంబర్ సయ్యద్ రషీద్ రైతుబంధు మండల అధ్యక్షుడు అహ్మద్ అజీముద్దీన్ జిల్లా రైతు కమిటీ సభ్యులు పోషన్న సాధన సమితి అధ్యక్షుడు మర్ప బాజీరావు జవాద్ అన్సారి లచ్చు పటేల్ మోతిరాం శ్రీరామ్ కొడుకు పటేల్ గంగారాం పటేల్ తదితరులు ఉన్నారు