Wednesday, 4 November 2026

రేషన్ మాఫియా!

కర్నూలు: రేషన్ దుకాణాలను అధికార పార్టీ నాయకులు తన్నుకుపోతున్నారు. అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి నిబంధనలను తోసిరాజని ఇష్టానుసారంగా తమ అనుయాయులకు కేటాయించుకుంటున్నారు. ఇదే అదనుగా రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. పేదలకు దక్కాల్సిన సబ్సిడీ సరుకులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు.

రాయితీ సరుకులను అక్రమంగా సేకరించి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఉండే పట్టణ కేంద్రాల్లోనే యథేచ్ఛగా రేషన్ సరుకులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నాయి. రేషన్ సరుకులను అక్రమంగా సేకరిస్తున్న రేషన్ మాఫియా ఇప్పుడు చౌకధరల దుకాణాలపై కన్నేసింది. భారీ మామూళ్లు ఇచ్చి ప్రజాప్రతినిధులు, అధికారులను తమ గుప్పెట్లోకి తీసుకుని ప్రజాపంపిణీ వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల కర్నూలు జిల్లాలో దాదాపు 100కు పైగా చౌక ధరల దుకాణాలను నిబంధనలకు  విరుద్ధంగా కేటాయింపులు చేయడంలో ఈ మాఫియా సఫలీకతమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *