Tuesday, 3 November 2026

రైతాంగ సమస్యలపై ఉద్యమించాలి: రైతు సంఘాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై ఉద్యమించాలని అఖిలపక్ష రైతు సంఘాలు నిర్ణయింయి. వ్యవసాయ పెట్టుబడులు గణనీయంగా పురుగుతున్న తరుణంలో అందుకుతగ్గట్లు కనీస మద్దతు ధర ప్రకటించకుండా, ఎరువులు ధరలు పెంచుతూ రైతులపైభారం మోపడంతో సంఘాలు ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించాయి. హైదరాబాద్‌లో అఖిల పక్ష రైతు సంఘాలు రాష్ట్ర స్థాయి సమావేశం ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం అధ్యక్షురాలు పశ్వ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి తొమ్మిది రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా రైతులపై భారాలు మోపుతుండటం చర్చించారు. తాజాగా కేంద్రం పెంచిన ఎమ్మెల్సే మద్దతు పెట్టుబడులు, దిగుబడులు, మార్కెట్‌ ధరలకు అనుగుణంగాలేవని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. రైతు వ్యతిరేక, అశాస్త్రీయ పద్దతులు పాటించడాన్ని ఖండించారు. రేపు లేదా ఎల్లుండి ముఖ్యమంత్రిని కలిసి పలు సమస్యలపై విన్నవించనున్నట్లు రైతు సంఘం నేత కె. రామకృష్ణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *