Saturday, 7 November 2026

రైతాంగ సమస్యలపై తహశీల్దార్ కార్యాలయం ఎదుట

రైతాంగ సమస్యలపై తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ
బోయిన్ పల్లి నవంబర్ 24 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల బోయిన్ పల్లి లో గురువారం రోజున టీపీసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర రైతు సమస్యలపై బోయినిపల్లి మండల కేంద్రం లోని తహశీల్దార్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ మండల పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలిపిన చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మేడిపల్లి సత్యం. ఈ సందర్బంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ
2014 లో రైతులకు ఎన్నికల హామీ ఇచ్చిన విధంగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ఒక్కసారి కాకుండా ఆరు విడుదలలు చేయడం వల్ల రైతులకు వడ్డీలకు కూడా సరిపోలేదు,2018ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు, పకృతి వైపరీత్యాల వల్ల రైతులకు అనేక రకాల నష్టపరిహారం అందించడం లేదు. ప్రక్షాళన,ధరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.రైతు పైన ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యలు తీర్చి రైతులను ఆదుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరుపున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కుస రవీందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు పులి లక్ష్మిపతి గౌడ్, తడగొండ ఎంపీటీసీ సభ్యులు ఉయ్యాల శ్రీనివాస్‌గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్లేష్,ఎండీ బాబు, ఎండీ హుస్సేన్,అనుముల హరికృష్ణ, పెండ్లి నాగరాజు, గంగిపెల్లి లచ్చయ్య ,జువ్వెంతుల లక్ష్మారెడ్డి ,కొండం మల్లయ్య ,దూస జనార్దన్,శీలం రెడ్డి,గుడి శేఖర్ రెడ్డి,సంపత్ కుమార్,కొండ రమేష్,ముద్దం వెంకటేష్,జంగా పర్శరామ్,పోతూరి మహేందర్,యువజన కాంగ్రెస్ నాయకులు నిమ్మ వినోద్ రెడ్డి,ఆకుల అజయ్,శాలివాహన శ్రీనివాస్,నక్క శ్రీకాంత్ శ్రీనివాస్, , జాగిరి వెంకటేష్, శ్రీమాన్, అజయ్, విజయ్,నితిన్ కార్యకర్తలు ఉన్నారు