Thursday, 5 November 2026

రైతుకు భరోసా కల్పించని బడ్జెట్‌: లక్ష్మణ్‌

హైదరాబాద్‌, మార్చి 11: తెలంగాణ బడ్జెట్‌ రైతులకు భరోసా కల్పించలేదని బీజేఎల్పీ నేత లక్ష్మణ్‌ పేర్కొన్నారు. బడ్జెట్‌ మొత్తం అంకెల గారడీల ఉందన్నారు. కరువు ఉపశమనంపై ప్రస్తావన లేదని, వాస్తవాలకు విరుద్ధంగా అంచాలున్నాయని లక్ష్మణ్‌ ఆరోపించారు. గత బడ్జెట్‌ కేటాయింపుల్లో 50 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదని సర్కార్‌పై నిప్పులు చెరిగారు. మద్యం ఆదాయం రూ.3 వేల కోట్లు చూపడమంటే ‘ఊరూరా బారూ.. బీరు పథకం’ పెట్టడమేనని విమర్శించారు. ఈ బడ్జెట్‌ అటు రైతులను, ఇటు ఉద్యోగులను పూర్తిగా నిరాశపరిచిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *