నారాయణఖేడ్, (మార్చి 11): పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని సాయిబాబా ఫంక్షన్‌హాల్లో పదో తరగతి విద్యార్ధులకు బుధవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. మూడు వేల మంది విద్యార్ధులు పాల్గొన్న ఈ సదస్సుకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణలు బోతీనాద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విద్యార్ధులు ప్రణాళికాబద్దంగా చదవాలని, అప్పుడే వారు నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని ఆయన చెప్పారు. ఈ సదస్సుకు మెదక్ డీఎస్పీ రాజరత్నం, సీఐ ముని, ఎస్‌ఐలు, డిప్యూటీ డీఇఓ కొండ్యానాయక్ తదితర్లు పాల్గొన్నారు.




