Wednesday, 4 November 2026

రైతును రాజు చేసిన ఘనత సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

 

జనం సాక్షి/ కొల్చారంరైతుబంధు రైతు బీమా పథకాల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కుటుంబాలను ఆదుకుంటున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి .తుక్కాపూర్ గ్రామంలో నేడు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని రైతు దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేశారు. రైతు దినోత్సవం సందర్భంగా ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతు వేదిక ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారు అని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ అహ్మద్, మండల బి ఆర్ ఎస్ అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా, బి ఆర్ ఎస్ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు, జెడ్పిటిసి ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్, మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు కొరబోయిన మంజుల కాశీనాథ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం, సర్పంచులు కరెంటు ఉమాదేవి, మన్నె శ్రీనివాస్, లంబాడి మోతి,నాగరాణి, ఝాన్సీ లక్ష్మి, గోదావరి, రామ్ రెడ్డి, నెల్లి కిష్టయ్య, మానస, బండి సుజాత, మాధవి, రమేష్, సంతోష, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, ఎంపీటీసీలు ఆదం ఎల్లయ్య, అరుణ కృష్ణ గౌడ్ .తుక్కాపూర్ ఆంజనేయులు, మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి, తాసిల్దార్ చంద్రశేఖర రావు, ఎంపీడీవో గణేష్ రెడ్డి, మండల పంచాయతీ అధికారి కృష్ణవేణి, పంచాయతీరాజ్ డిఇ అమరేశ్వర్, సహాయ ఇంజనీర్ ఇర్ఫాన్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శులు అంజయ్య, అరుంధతి, మహేష్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.