పెనుబల్లి, జూన్ 3(జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రైతు దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం పెనుబల్లి మండలం, తాళ్లపెంట క్లస్టర్ పరిధిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు, ర్యాలీలో మోటర్ సైకిల్, ట్రాక్టర్లతో వందలాదిమంది రైతులతో పాల్గొని రైతు వేదిక వద్ద నిర్వహించిన రైతు దినోత్సవ సంబరాల్లోఆయనపాల్గొన్నారు ఈ సంధర్భంగా సండ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేసిన అభివృద్ధిని రైతు సంక్షేమ పథకాలను రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిదులు,నాయకులు,అధికారులు,కార్యకర్తలు, రైతులు తదితరు లు పాల్గొన్నారు.
తాళ్ళ పెంట గ్రామంలో రైతు దినోత్సవ వేడుక ల్లో పాల్గొన్న – సండ్ర




