Tuesday, 3 November 2026

రైతులకు అండగా సీఎం కెసిఆర్

రైతులకు అండగా సీఎం కెసిఆర్ :అఫ్జల్ ఖాన్ : శామీర్ పేట్,జనంసాక్షి
రైతులకు 10 వ విడత రైతు బంధు వారి ఖాతాల్లో జమ కావడంతో శామీర్ పేట లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు..ప్రజలకు ఏదో ఒక పధకంతో లబ్ది చేకూర్చే సంకల్పంతో అహర్నిశలు కృషి చేస్తున్న కే‌సిఆర్ రైతులకు పెద్ద ఎత్తున ప్రాజెక్టుల ద్వారా పంట పొలాలు పుష్కలంగా పండే విదంగా చేశారని , ఈ క్రమంలో రైతు బంధు ద్వారా మరింతగా రైతులకు లబ్ది చేకూర్చే విధంగా చేశారని అన్నారు. ఈ దశలో రాష్ట్రంలో ప్రజలు వివిధ పధకాలతో లబ్ది పొందటం చూసి యావత్తు భారత ప్రజలు ఇలాంటి పాలన కోసం ఎదురు చూస్తున్నారని, ఈ క్రమంలో లోనే కేసిఆర్ బిఆర్ఎస్ స్థాపించి జాతీయ రాజకీయాల్లో అడుగు వెయటం మంచి శుభ పరిణామం అని అఫ్జల్ ఖాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి. నాయకులు బత్తుల శశికాంత్ యాదవ్ , కేసిఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, కేసిఆర్ సేవాదళం మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి నర్సింహ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కెసిఆర్ కు పాలభిషేఖం చేస్తున్న అఫ్జల్ ఖాన్