కరీంనగర్, (మార్చి, 11): మల్లాపూర్ మండలం రాఘవపేటలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెరకు రైతుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. తమ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాఘవపేటకు వచ్చిన మంత్రిని స్థానిక ఆందోళనకారులు నిలదీశారు. దీనిపై స్పందించిన మంత్రి.. సమస్యపై తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.




