Thursday, 5 November 2026

రైతులకు పరిహారం.. వైఎస్‌ జగన్‌ విజయం: వైకాపా

హైదరాబాద్‌,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి)
: జగన్‌ పోరాటం వల్లనే ఆత్మహత్యచేసుకున్న  రైతుల ఎకుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియాపై ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఆ పార్టీ నేత పార్థసారధి తెలిపారు. రైతుల ఎక్స్‌ గ్రేషియాపై తదితర ఆంశాలకు సంబంధించి శుక్రవారం విూడియాతో మాట్లాడిన పార్థసారధి..  ఇది తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విజయమని పేర్కొన్నారు. గతంలో రైతుల ఆత్మహత్యలను భూతద్దంలో చూపిస్తోందని వైఎస్సార్‌ సీపీని ప్రభుత్వం విమర్శించిందన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  రైతులకు అండగా ఉండేందుకు వైఎస్‌ జగన్‌ భరోసా యాత్ర  చేయబోతున్నారని తెలిసే ప్రభుత్వం ఈ జీవో జారీ చేసిందన్నారు. రైతులకు ఎక్స్‌ గ్రేషియా జారీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రైతులకు మేలు జరగడమే తమకు కావాల్సిందని పార్థసారధి తెలిపారు. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం ఎగనామం పెట్టేలా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 3.5 లక్షల పరిహారంతో పాటు మరో రూ. 1.5 లక్షలను రుణంగా కూడా ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *