హైదరాబాద్,ఫిబ్రవరి20 ( జనంసాక్షి)
: ఆంధప్రదేశ్‌లో శ్రీరామనవమి ఉత్సవాలను కడప జిల్లాలోని అత్యంత పురాతన ఆలయమైన ఒంటిమిట్ట ఏకశిలానగరం రామాలయంలో నిర్వహించనున్నట్లు ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. శ్రీరామనవమి వేడుకలను ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. సచివాలయంలో విూడియాతో మాట్లాడుతూ రాములవారి కల్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫనె పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారన్నారు. మార్చి 28న శ్రీరామనవమి నిర్వహణకు దేవాదాయశాఖతో పాటు, ఇతర శాఖలన్నీ పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తాయని ఆయన వివరించారు. గోదావరి పుష్కరాలకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని వెల్లడించారు. పుష్కరాలకు వస్తే పదవి పోతుందన్న వాదనలను ఆయన కొట్‌ంటి పారేశారు.




