ఖారైతులకు రుణమాఫీ దో*
రుణ మాఫీ అమలేదనీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి*
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్ రద్దు చేయాలని డిమాండ్*
రేపు మండల కార్యాలయం ముందు నిరాసన *
న్యూడ్ కాల్స్ కేసులో అసలు నిందితులను తప్పిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు *
గద్వాల, ఆర్ సి. నవంబర్ 23,
(జనం సాక్షి)
గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక ల ముందు సీఎం కేసీఆర్ రైతులకు ఏకకాలంలో రుణ మాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు 24 వేల కోట్లు దీంతో రైతులు అప్పులు కట్టుకోలేక ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారని తక్షణమే రైతులకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఫోటోలు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధరణి సమస్యలు పెరుగుతున్నాయని
అన్నారు .దాంతో రైతులు సమస్యలను తట్టుకోలేక తాహసిల్దార్ కార్యాలయం చుట్టూ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారనీ ఇటువంటి
పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఈ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తు దాదాపు 25 లక్షల ఎకరాలకు సంబంధించి పట్టా భూములను రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంతో నిషేధిత జాబితాలో ఉన్నాయని దీనికోసం 90 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చారని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు భూములకు పట్టాలే ఇవ్వలేదని రైతులకు ధాన్యం కనుగోలు చేసిన వెంటనే రశీదు ఇవ్వాలని
డిమాండ్ చేశారు.24 వ తేదీన మండల కేంద్రాల్లో ఈ నెల 30వ తేదీన నియోజకవర్గలో 5 తేదీన జిల్లా కేంద్రంలోని ఆందోళనలు చేపడతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధరల పై రైతు రుణమాఫీ రైతులకు పట్టా భూములు పోడుభూములకు సంబంధించి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.




