జనంసాక్షి , మంథని : అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులు ఏ మాత్రం అధైర్య పడవద్దని, వారికి అండగా ఉంటామని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు. బుధవారం మంథని ఏఎంసి, గంగాపురి, శ్రీరాంనగర్, పవర్ హౌస్ కాలనీ, అంగుళూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించి రైతులను ఓదార్చారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ మాట్లాడుతూ.. అకాల వర్షాలు కురుస్తున్న౦దున రైతులు అప్రమతంగా ఉండాలని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు త్వరగా అంచనా వేయాలని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు నష్టాన్ని ప్రభుత్వానికి నివేధిస్తామన్నారు. వరి ధాన్యం కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. పంట నష్టం వివరాలను సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా వివరించారు. వీరి వెంట సంఘ డైరెక్టర్ కొత్త శ్రీనివాస్, ఎంపీపీ కొండ శంకర్, ఏఎంసీ చైర్మన్ ఎక్కటి అనంత రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు గుండా విజయలక్మి-పాపారావు, కొట్టే పద్మ-రమేష్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏగోళపు శంకర్ గౌడ్, నాయకులు తగరం శంకర్ లాల్,నక్క నాగేంద్ర-శంకర్, సంఘ సీఈఓ మామిడాల అశోక్ కుమార్, రైతులు ఉన్నారు. కష్ట కాలంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. పీఏసీఎస్ పరిధి మంథని మండలంలోని సూరయ్య పల్లి, కాకర్లపల్లి, గోపాల్ పూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఎంపీపీ కొండ శంకర్, ఏఎంసీ ఛైర్మన్ ఎక్కటి అనంత రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు ఆకుల కిరణ్ లతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్బంగా సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ కల్లాల్లో కలియ తిరుగుతూ వర్షానికి దెబ్బతిన్న దాన్యాన్ని పరిశీలించారు. సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ.. వర్షానికి దెబ్బతిన్న పంటలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసి రంగు మారిన ధాన్యం నష్ట తీవ్రతను పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ద్వారా ప్రభుత్వానికి నివేధించి రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలిపారు. గాలి వానలు కురుస్తున్న౦దున రైతులు తమ ధాన్యం కుప్పల పై టార్పాలిన్లు కప్పి ఉంచుకోవాలని సూచించారు. తడిసిన ప్రతి గింజ కొనుగోలు జరిగేలా చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. తడిసిన దాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులు చేరవేసేలా చర్యలు చేపడతామని అన్నారు. వీరి వెంట సర్పంచులు భీముని పుష్ప-వెంకట స్వామి, కన్నెబొయిన పద్మ-కొమురయ్య, కెక్కర్ల సునీత, ఎడ్ల పద్మ-బాపు,ఎంపీటీసీ చేరుకుతోట ఓదేలు, నాయకులు సుధాటి మొగిలి, మేడ శ్రీనివాస్, కొప్పుల మల్లయ్య, మామిడి దేవేందర్, తదితరులు ఉన్నారు.




