ఏర్గట్ల ఏప్రిల్ 26 (జనంసాక్షి):నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో పలు గ్రామాలను సర్పంచులు,ఏఈఓ లతో కలిసి తడిసిన వరి ధాన్యాన్ని, నువ్వు, సజ్జ పంటలను పరిశీలించినట్లు ఏవో అబ్దుల్ మాలిక్ తెలియజేశారు. అనంతరం అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ దాదాపు 600 ఎకరాల నువ్వు,సజ్జల పంటలు నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాలు వేసి 600 ఎకరాల నష్టపరిహారం గురించి ప్రభుత్వానికి నివేదించినట్టు తెలియజేశారు.కోసిన వరి ధాన్యన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు,ఉపసర్పత్తులు, ఎంపిటిసిలు, రైతుబంధుఅధ్యక్షులు, ఏఈఓ స్నేహ,సచిన్ తదితరులు పాల్గొన్నారు.




