ఆదిలాబాద్, సెప్టెంబరు 11 : రైతుల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు కోరారు. వ్యవసాయానికి 9 గంటలపాటు విద్యుత్‌ను అందిస్తామని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామి ఇచ్చారు. రైతుల ప్రస్తుత దుస్థితికి గత ప్రభుత్వాల వైఫల్యాలే కారణమని ఆయన ఆరోపించారు. ఏళ్ల తరబడి పాలించిన కాంగ్రెస్, టీడీపీలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.




