Thursday, 5 November 2026

రైతులు కొనుగోలు కేంద్రలను సద్వినియోగం చేసుకోవాలి.

రైతులు కొనుగోలు కేంద్రలను సద్వినియోగం చేసుకోవాలి.
– బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
నెన్నెల, నవంబర్ 14, (జనంసాక్షి )
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం ఆయన మండలంలోని గుండ్ల సోమారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల కష్టం తెలిసిన మనిషి కాబట్టే కేంద్రం బియ్యం కొనుగోలుకు విముకత చుపినప్పటికీ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో గిట్టుబాటుధర కల్పిస్తూ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ సంతోషం రమాదేవి – ప్రతాప్ రెడ్డి , జడ్పీటీసీ సింగతి శ్యామల – రాం చందర్, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, టీఆరెఎస్ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.