ఒకరి కోసం అందరం-అందరి కోసం ఒక్కరు” అనే గొప్ప సహకార స్ఫూర్తికి మనం కట్టుబడి ఉండాలి…
-చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
హన్మకొండ బ్యూరో చీఫ్ 14 జనంసాక్షి
సహకార సంస్థలు దండుగా అనే పరిస్థితి నుండి… పండుగ అనే స్థితికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తీర్చిదిద్దడం జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు…
69వ అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకుని కల్పలత సూపర్ బజార్ ఆధ్వర్యంలో ఏర్పాటు వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ఆయన ఒక సహకార సంస్థ బలోపేతం కోసం విశేష కృషి చేసిన బాధ్యునిగా హాజరై సహకార సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసి అనంతరం సూపర్ బజార్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారోత్సవాలను ఉద్దేశించి ప్రసంగించారు…
ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంస్థలను నిస్సహాయ స్థితిలోకి నెట్టేసిన ఆనాటి ప్రభుత్వాలతో ఆవిశ్రమ పోరాటం చేయడం జరిగిందన్నారు. నేడు నగరంలో అనేక వర్కర్స్,ఆటో,రిటైర్డ్,వాకర్స్,మహిళ,పొదుపు సంఘాలను సహకర సంస్థలుగా నమోదు చేసుకునేందుకు వారికి అవగాహనను కల్పించడం జరిగిందన్నారు.. నేడు ఆ సంఘాలు మంచి లాభాల బాటలో నడుస్తూ ఆర్ధిక పురోవృద్ధిని సాధిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు… రాబోయే రోజుల్లో వినూత్నమైన విధానంలో అనేక మందికి లాభం చేకూర్చే విధంగా సహకార రంగాన్ని తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం వాహనదారులకు లక్కీడ్రా కుపన్లను అందించారు.
ఈ కార్యక్రమంలో కల్పలత సూపర్ బజార్ చైర్మన్ వర్ధమాన్ జనార్దన్,మేనేజింగ్ డైరెక్టర్ జగన్మోహన్ రావు,వైస్ చైర్మన్ ఎండి షఫీ,సహకార సంస్థ కళాశాల ప్రిన్సిపల్ యాకుబ్ నాయక్,డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి,దానం,స్వర్ణలత, పలు సహకార సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…




