ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
-గంగారంలో రూ.3.15 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
-దసరా నుండి డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు
-మెడికల్ కళాశాలను అడ్డుకుంటున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలన్న మర్రి
– ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చా
బిజినేపల్లి, జనం సాక్షి. సెప్టెంబరు 20 : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు చల్లగా ఉండాలని శ్రీమంతులు కావాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు .. మండలంలోని గం. గారంలో మంగళవారం రూ.3.15 కోట్లతో చేపట్టిన రైతువేదిక. గ్రామ సచివాలయం, సీసీ రోడ్లు, ఫారెస్సు భవనం, అండర్ డ్రైనేజీ వంటి 22 పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి రైతువేదిక ఆవరణలో సర్పంచ్ శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లు రైతుబంధు కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలబడి పేద ప్రజల గౌరవాన్ని పెంచింది సీఎం కేసీఆర్ అని అన్నారు ఉమ్మడి జిల్లాలోనే ఎంతో వెనకబడిన ప్రాంతంగా ఉన్న నాగర్ కర్నూల్ నియోజవర్గాని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు తనవంతుగా ఏజీ బీస్సీ కళాశాల, మెడికల్ కళాశాల, మార్కండేయ ప్రాజెక్టు, పెండింగ్ కేఎల్వ పనులు, పాలమూరంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఎం కేసీఆర్ ను ఒప్పించి తీసుకొచ్చానని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ ప దకాల ఫలాలను అర్హులకు అందిస్తూనే. రూ.15 కోట్ల స్వంత నిధులతో 5 ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ పాఠశాలలకు దీటు నిర్మించి పేద విద్యార్థులకు సకల వసతులతో విద్యా అందించేందుకు కృషి చేస్తునట్లు పేర్కొన్నారు. ప్రతియేటా పేదింటి ఆడ బిడ్డలవివాహాలను అంగరంగ వైభవంగా చేసి పట్టు వస్త్రాలు, ఇంటికి కావల్సిన సామాగ్రి ఇచ్చి తన వంతు సాయం చేస్తున్నాన్నారు. గతం లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు అనుభవించిన నాయకులు ఈప్రాంతాని అభివృద్ధి పర్చకపోగా వచ్చిన ఇంజనీరింగ్ కళాశాలను అమ్ముకున్న నీచ చరిత్ర ఉందని విమర్శించారు. పేదలకు కార్పోరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మెడికల్ కళాశాలను రూ.600 కోట్లతో నిర్మించి ప్రారంభించుకునేందుకు సిద్ధం అవుతుండగా ప్రజలకు వైద్య సేవలు అందితే తన రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని అడ్డుకునేందుకు బీజేపీ, బీఎస్పీ ఇతర పార్టీల నాయకులతో కలిసి కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. ఎవ్వరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజా సేవే మాధవ సేవగా పేద ప్రజలకు అంద దుబాటులో ఉండి సేవలు అందిస్తానని అన్నారు. వర్షా ప్రభావం వల్ల మార్కండేయ ప్రాజెక్టు ఆలస్యం కావడం జరిగిందని త్వరలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేసి కృష్ణమ్మ నీటితో గంగారం గ్రామ ప్రజల కాళ్లు కడుగుతానని ఆయన అన్నారు గతంలో రాష్ట్రాన్ని పాలించిన ఎన్టీఆర్ వైయస్సార్ ప్రజలకు మంచి పాలన అందించారు కాబట్టి వారిని గుర్తు చేసుకోవడం తప్ప ఏమీ లేదని ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అర్హులైన ప్రజలను ఆదుకుంటున్నందుకు సీఎం కేసీఆర్ ను కూడా ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని అన్నారు అనంతరం నూతనంగా వచ్చిన ఫించన్ దారులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ గంగనమోని కురుమయ్య, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నాయినోళ్లు బాల్‌రాజ్ గౌడ్. రైతుబంధు మండల అధ్యక్షుడు నెల్లికంటి మహేశ్వర్‌రెడ్డి, ఎస్ఆర్ పర్వేజ్ అహ్మద్. తహసీల్దార్ అంజిరెడ్డి, ఎంపీడీఓ కృష్ణయ్య, ఏడీఏ రమేష్‌బాబు, ఏవో నీతి, డీఈ గోవిందునాయక్, ఏఈ బసవలింగం, సర్పంచ్‌లు కృష్ణఅంజినాయక్, లింబ్యానాయక్, మస్కూరి అవంతి, పాండు నాయక్, మంగ్లీ, ఎంపీటీసీ గోపిలక్ష్మినాయక్ తదితరులు పాల్గొన్నారు.




