Wednesday, 4 November 2026

రైతులు పీఎం కిషన్ కోసం ఇకేవైసీ చేసుకోవాలి

రైతులు పీఎం కిషన్ కోసం ఇకేవైసీ చేసుకోవాలి

ఎవో హరీష్ కుమార్

రామారెడ్డి డిసెంబర్ 4 ( జనంసాక్షీ ) :

రైతులు పీఎం కిషన్ కోసం ఇకేవైసీ చేసుకోవాలని రామారెడ్డి మండల వ్యవసాయ అధికారీ
ఎవో హరీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని ప్రతి గ్రామంలో రైతులు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టమని అన్నారు. పీఎం కిషన్ ఇకేవైసీ చేసుకొని రైతులు రామారెడ్డి మండలం లోని పదహారు వందల పద్దెనిమిది మంది రైతులు పీఎం సమ్మాన్ నిధి కోసం ఇకేవైసీ చేసుకోవాలన్నా రు. లేనిచో 12 విడత డబ్బులు రావని తెలియజేయ డం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈఓలు ప్రియాంక , రైతులు తదితరులు పాల్గొన్నారు.