ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
ఫోటో రైట్ అప్: ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
పెన్ పహాడ్. డిసెంబర్ 03 (జనం సాక్షి) : ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనం వద్ద ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మైలారపు వెంకన్న, ఐసీడీఎస్ సూపర్ వైజర్ వీరమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కీత వీరేందర్ , ఐ ఆర్ పి పావని, ఓంకార్, పిల్లల తల్లిదండ్రులు హుస్సేన, రమ్య, సిబ్బంది రాయి ఉప్పలయ్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




