మోమిన్ పేట జూన్ 03 (జనం సాక్షి)
రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం మోమిన్ పెట్ మండలం మేక వనంపల్లి , మోమిన్ పెట్ క్లస్టర్లలో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో ఎడ్లబండ్లతో భారీ ర్యాలీలను నిర్వహించారు. ఈ సందర్భంగా మోమిన్ పేట్ ఏజేఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రైతు ఏర్పాటుచేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవసాయ రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించి రైతులు ఆదాయ పరంగా ఎదిగేందుకు ఎంతో తోడుపాటును అందిస్తుందని కలెక్టర్ అన్నారు. తెలంగాణ అవతరించిన తర్వాత రైతుల అభివృద్ధి గురించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగా 24 గంటల నిరంతర విద్యుత్తును అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రైతులకు అనుకూలమైన స్థలాలను గుర్తించి జిల్లాలో 99 రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. 70 శాతం వ్యవసాయంపైనే ఆధారపడ్డ రైతులకు భరోసానిస్తూ రైతుబంధు పథకం కింద సంవత్సరానికి ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున పెట్టుబడికి గాను అందించడం జరుగుతుందని అన్నారు. రైతులు సహజ మరణం చెందినప్పటికీ వారి కుటుంబాలను తక్షణమే ఆదుకునేందుకు 5 లక్షల రూపాయలు రైతుబంధు పథకం కింద అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 80 శాతం వరకు పూర్తి కావడం జరిగిందని దీనివల్ల జిల్లాకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కు సమీపంగా ఉన్న వికారాబాద్ జిల్లాలో ఉద్యానవన పంటలు సాగు చేసుకునేందుకు మంచి వాతావరణం ఉందని , ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించబోతుందని, ఉద్యాన పంటల సాగుకు రైతులు ముందుకు వచ్చి ఆర్థికంగా బలపడాలని కలెక్టర్ కోరారు. రైతులు తలెత్తుకొని బ్రతికేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ దిశగా ప్రభుత్వ సహాయం పొందుతూ ముందుకు వెళ్లాలని కలెక్టర్ కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించేందుకు ముందుకు సాగాలన్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని కూడా కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. వాతావరణం లో సమతుల్య ఉన్నప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తామని అన్నారు. నేటి లభ్యత అధికంగా ఉండాలంటే వర్షపాతం ఉండాలి, వర్షపాతం అధికంగా కావాలంటే అటవీ సంపద పెంపొందించుకోవాలి ఆ దిశగా వచ్చిందే హరితహారం అని ఆయన అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. వికారాబాద్ జిల్లా ప్రాంతం పై ప్రత్యేకమైన దృష్టి సారిస్తుందని పారిశ్రామక వాతావరణాన్ని పెంపొందించే దిశగా కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ వసంత, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, సురేష్, పార్వతమ్మ , బి. అంజయ్య, రైతుబంధు కోఆర్డినేటర్ అజీజ్, మిషన్ భగీరథ ఎస్ఈ ఆంజనేయులు, ఇఇ బాబు శ్రీనివాస్, తాసిల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో శైలజ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి జయశంకర్ తదితరులు పాల్గొన్నారు
రైతులు బాగుంటేనే రాష్ట్రం సభిక్షంగా ఉంటుంది జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి




