Wednesday, 4 November 2026

శిలాఫలకాలు శిథిలం అవుతున్నాయన్న బిజెపిఅభివృద్ధికి నోచుకోని చెరువులు అలుగునీరు వెళ్లే మార్గంలో నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూన్ 3 :—. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురం చెరువుతో సహా దాదాపు నాలుగు చెరువులు ఎలాంటి అభివృద్ధికి నోచుకోక పోవడం అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని జవహర్ నగర్ బిజెపి పార్టీ అధ్యక్షులు రంగుల శంకర్ నేత అన్నారు ఒకవైపు మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ చెరువుల పరిరక్షణ పేరుతో వేల కోట్ల ఖర్చు చేస్తున్నామంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మిషన్ భగీరథ చెన్నాపురం చెరువుకు వర్తించదా అని నిలదీశారు ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని చెన్నాపురం చెరువు ముంపు ప్రాంతం కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారని సరైన మరమ్మతులు లేక చెరువు కట్టపై చాలా వరకు పెద్ద పెద్ద గొయ్యీలు ఏర్పడి ప్రమాదకరంగా మారితే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో సార్లు కంప్లైంట్ చేసినా ఏదో తూతూ మంత్రంగా చెరువు కట్టకు మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారని తెలిపారు జవహర్ నగర్ లోని చెరువు కట్టలు ప్రస్తుతం మందుబాబులకు, గంజాయి, పేకాట రాయుళ్లకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారి సామాన్య ప్రజలు అటువైపు వెళ్లాలంటే భయానక వాతావరణం నెలకొందని గత సంవత్సరం వర్షాకాలంలో చెరువు నిండి పోయి అలుగు దుంకిన నీటికి సరైన నాలా వ్యవస్థ లేకపోవడం వల్ల ఉధృతమైన వరద ధాటికి చెన్నపూర్ దగ్గర జవహర్ నగర్ ప్రధాన రోడ్డు మార్గం కొట్టుకు పోవడం జరిగిందనీ వివరించారు పాలకమండలి అధికార వ్యవస్థ కేవలం తూతూమంత్రంగా పనులు చేస్తున్నారు తప్ప దీని శాశ్వత పరిష్కారానికి పూనుకోవడం లేదని చెరువు నుండి బయటకు వచ్చే నీళ్లకు సరైన నాలా మార్గం లేక అలుగుకు అతి సమీపంలోనే అడ్డుగా సబ్ స్టేషన్ కాంపౌండ్ వాల్ ఉండడం వల్ల చేరువు నుండి వచ్చే నీళ్లు మెయిన్ రోడ్ పైనుండి వెళ్లి రోడ్ మరియు పక్కన ఉన్న పంట పొలాలు పాడైయ్యాయి సంతోష్ నగర్ చివర ఉన్న సుభద్రమ్మ కాలనీ, పాపయ్య నగర్ కాలనీలతో పాటు పలు కాలనీలు పూర్తిగా ముంపుకు గురి కావడం జరుగుతుందని గతంలో కూడా సదరు కాలనీలు ముంపునకు గురై రోజుల తరబడి ప్రజలు తీవ్ర నష్టానికి గురైంది వాస్తవం కాదా ఇలాంటి పరిస్థితి మునుముందు జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం మున్సిపాలిటీ అధికారులు పాలకమండలి సభ్యులతో పాటు మంత్రి మల్లారెడ్డి పై లేదా అని నిలదీశారు గత సంవత్సరం కూడా జవహార్ నగర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ దృష్టికి తీసుకువెళ్లినా కేవలం కంటితుడుపు చర్యలతో సరిపెట్టారనీ ఆరోపించారు వచ్చే వర్షాకాలం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు కళ్ళు తెరిచిన పాపాన పోలేదనీ ఇప్పటి వరకూ చెరువు అలుగు నీళ్లకు ఎలాంటి ప్రణాళిక చేయలేదు కానీ చెరువు అలుగునీరు వెళ్లే స్థలంలో ఆగమేఘాల మీద నాన్ వెజ్ మార్కెట్ మాత్రం నిర్మిస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు జవహార్ నగర్ అనేది పేరుకే కార్పొరేషన్ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఒక మాయ అని అభివృద్ధి పేరుతో నిధుల దోపిడీ జరుగుతుందని ఆరోపించారు జవహర్ నగర్ ప్రజలను పట్టించుకోని అధికార పార్టీ నాయకులు నేడు దశాబ్ది ఉత్సవాల పేరుతో సంబరాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు ఈకార్యక్రమంలో జవహార్ నగర్ లోని బిజెపి మరియు వివిధ మోర్చాలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగిన నాయకులు మరాఠి బాబు, కమల్, రామ్ నాయక్, ముత్యం సుజాత, మంచన శ్రావణ్ కుమార్ పటేల్, వీర్ల బుజ్జి, బొమ్మ యాదగిరి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఇలయ్ కుమార్ పటేల్ తదితరులు పాల్గొన్నారు