Wednesday, 4 November 2026

రైతుల ఆత్మహత్యలకు ఎక్స్‌గ్రేషియా: పోచారం

హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంత్రి శాసనమండలిలో మాట్లాడుతూ.. జూన్‌ 2 నుంచి ఇప్పటి వరకు 55 మంది రైతులకు రూ. లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించామని ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలకు సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తామని స్పష్టం చేశారు. గతంలో జరిగిన రైతు ఆత్మహత్యలకు తాము ఎక్స్‌గ్రేషియా చెల్లించామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన పాపాలను తాము కడుగుతున్నామని తెలిపారు. తమ రైతు సంక్షేమ ప్రభుత్వమని ఉద్ఘాటించారు.  ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలకు సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తామని స్పష్టం చేశారు. గతంలో జరిగిన రైతు ఆత్మహత్యలకు తాము ఎక్స్‌గ్రేషియా చెల్లించామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన పాపాలను తాము కడుగుతున్నామని తెలిపారు. తమ రైతు సంక్షేమ ప్రభుత్వమని ఉద్ఘాటించారు.  రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అర్హులైన రైతులుందరికీ రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రుణమాఫీ ద్వారా 36 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. వివిధ పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులను ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. సబ్సిడీపై నాణ్యమైన విత్తనాల సరఫరా జరుగుతుందన్నారు. కౌలు రైతులకు కూడా బ్యాంకుల నుంచి రుణాలు ఇస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *