Wednesday, 4 November 2026

రైతుల ఆత్మహత్యలను పట్టించుకోవడం లేదు

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 : రైతుల ఆత్మహత్యలను టీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. 400 మంది రైతు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున టీడీపీ సాయం చేసిందన్నారు. రైతాంగంపై శ్రద్ధ పెట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. ఏపీలో ఎప్పుడో రైతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారన్నారు. ఏపీతో అన్నింటిలో పోటీ పడే కేసీఆర్‌ రైతుల కుటుంబాలకు పరిహారాన్ని పదిలక్షల రూపాయలకు పెంచాలని ఎర్రబెల్లి డిమాండు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *