Tuesday, 3 November 2026

రైతుల ఖాతాల్లోనే డబ్బు

harish-rao-call-back-to-peopleవ్యవసాయ మార్కెట్లలో పంటను అమ్ముకునేందుకు వచ్చే రైతులకు ఇబ్బంది కలుగకుండా ఆన్‌లైన్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బు జమచేసేలా చర్యలు తీసుకోవాలి. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో అమలులో ఉన్న ఆర్‌టీజీఎస్ (రియల్‌టైం గ్రాస్ సెటిల్‌మెంట్) విధానం అన్ని మార్కెట్లలో అమలు జరిగేలా చూడాలి. ప్రభుత్వ మార్కెటింగ్ గోదాంలలోనే సరుకులు నిల్వ ఉంచేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. ఉల్లిగడ్డల కృత్రిమ కొరత సృష్టించేవారిపై కఠినంగా వ్యవహరించాలి.ఆర్‌టీజీఎస్ విధానం అన్ని మార్కెట్లలో అమలు చేయాలని మార్కెటింగ్‌శాఖ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. నోట్లరద్దు వల్ల తలెత్తిన సమస్యలపై మంత్రి సమీక్షించారు. కొత్త మార్కెటింగ్ చట్టంపై వారంలో సమావేశం నిర్వహించాలని సూచించారు. పెద్దనోట్ల రద్దువల్ల మార్కెటింగ్ కార్యకలాపాలు స్తంభించడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *