Monday, 2 November 2026

రైతుల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు

అందరిదీ రైతు సంక్షేమ నినాదమే
లక్ష్యం నెరవేర్చని సంక్షేమ పథకాలు
హైదరాబాద్‌,జూన్‌10(జ‌నంసాక్షి): తెలంగాణలో ఎన్నికల సమయంలో పథకాలు ప్రకటించాలనుకుంటున్న కాంగ్రెస్‌,బిజెపిలకు పాలుపోవడం లేదు. ఏం ప్రకటిస్తే ప్రజలను ఆకట్టుకోగలమో కూడా తెలియడం లేదు. ఎందుకంటే ఏ వర్గాన్నీ వదలకుండా సిఎం కెసిఆర్‌ అన్ని పథకాలు ప్రకటించి అమలు చేస్తున్నారు. కొత్త ఆలోచనలతో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. చివరకు 24 గంటల కరెంట్‌ ఇస్తున్నారు. మంచినీటి కోసం మిష్‌ భగీరథ, చెరువుల తవ్వకం అన్నీ అయిపోయాయి. ఇక ఎకరాకు పదివేల సాయం ఇప్పటికే అమలవుతోంది. ఈ దశలో మిగిలివున్న వర్గం ఏదైనా ఉందా ఉంటే వారికి ఏం చేయాలన్న దానిపైనా సమాలోచనలు చేస్తున్నారు. ఈ దశలో 24 గంటల కరెంట్‌ సరఫరాను వ్యతిరేకించిన కాంగ్రెస్‌ ప్రజల్లో అభాసు పాలయ్యింది. ఇకపోతే కేంద్రం నుంచి సాయంగా ఒక్కపనీ చేయించలేని బిజెపి కూడా అధికారంలోకి వచ్చేది తామే అని కాలుదువ్వుతోంది. నిజానికి ఇప్పుడున్న సీట్లలో సగం రావడం కష్టమే.
అందుకే తమవంతుగా బిజెపిశాఖ రైతు రుణ మాఫీ రేసులోకి దూకింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణం మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ అయితే గత ఏడాది కాలంగా ఇదే హావిూని రైతుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ హావిూలను అధికార టీఆర్‌ఎస్‌ కొట్టి పారేస్తుంది. ఒకేసారి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ సాధ్యంకాదని అధికార పార్టీ చెబుతోంది. అయినా కాంగ్రెస్‌, బిజెపిలు మాత్రం హావిూలతో ముందు కెళ్ళటానికే నిర్ణయించుకున్నాయి. టీఆర్‌ఎస్‌ సర్కారు పెట్టుబడి రాయితీ పేరుతో పదివే రూపాయల లెక్కన ఇస్తోంది. బిజెపి తెలంగాణలో విజయబావుటా ఎగరేస్తుందని చెబుతున్నారు. తెలంగాణలో రైతులు కష్టాలపాలు అవుతున్నారని బిజెపి ఎంపి లక్ష్మణ్‌ విమర్శించారు. కేరుణమాఫీ బ్యాంకుల వడ్డీలకే సరిపోయిందని విమర్శించారు. ప్రభుత్వం చెప్పిన నకిలీ విత్తన చట్టం ఊసే లేదన్నారు. నకిలీ విత్తన కంపెనీలకు టీఆర్‌ఎస్‌ సర్కారు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఇకపోతే రైతులకు వడ్డీ లేని రుణాలి స్తామని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్‌ కూడా రైతులను నమ్ముకునే పనిచేస్తోంది. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రేవంత్‌ రెడ్డి అంటున్నారు. కేసీఆర్‌ వైఫల్యాల మూలంగానే గడిచిన నాలుగేళ్లలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతులెవరూ అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. కవిూషన్లకు కక్కుర్తి పడి కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్‌ చేశారని ఆరోపించారు. కేవలం కాంట్రాక్టర్లకు లాభం చేసేందుకు రూ.85 వేల కోట్లకు అంచనాలు పెంచారన్నారు. నిరుపేదల భూములను కేసీఆర్‌ ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందన్నారు. నష్టపరిహారం విషయంలోనూ స్పష్టలేదన్నారు. కుట్రపూరిత ఆలోచనలతో కేంద్రంతో కేసీఆర్‌ ప్రభుత్వం తటస్థ వైఖరి అవలంబి స్తున్నారని విమర్శించారు. మొత్తంగా అందరికి పథకాలు ప్రకటించాలంటే ఏం చేయాలన్నది ఇప్పుడు అంతుపట్టడం లేదు.