Wednesday, 4 November 2026

రైతుల నిరసన, ధర్నాకు సంఘీభావం ప్రకటించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వడి కృష్ణారావు

 

 

 

 

వ్యవసాయ క్షేత్రంలో కంటే ఎక్కువగా రోడ్డు మీద నిరసనలతో రైతుల సమయం పాడైపోతుంది.మెట్పల్లి, ఫిబ్రవరి 11, జనంసాక్షి:జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గసాగర్ లో రైతులు విద్యుత్తు కోతలను నిరసిస్తు సబ్ స్టేషన్ ముందు తలపెట్టిన నిరసన ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు సంఘీభావం ప్రకటించి గ్రామ రైతులతో పాటు నిరసనలో పాల్గొనడం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆమోదయోగ్యమైన రీతిలో రైతు ఉన్నతికి కృషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి భిన్నంగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేయాల్సిన పనులను వదిలి రైతుల్లో వ్యవసాయం చేద్దాం అనే ఆలోచన లేకుండా చేస్తున్నారని ద్వజం ఎత్తారు..రైతులకు 24 గంటలు అని చెప్పి కనీసం 6 నుంచి 07 గంటలు కూడా సమయపాలన లేకుండా విద్యుత్తు ఇవ్వడం వలన పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గి రైతు నష్టపోయే విధానాలు మంచివి కావు అని,
యుద్ద ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి కళ్ళు తెరిచి వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. దేశానికి అన్నం పెట్టే రైతుల మీద రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మరియు అధికారులు ఇంతా కక్ష సాధింపు చర్యలకు ఎందుకు దిగుతున్నారనేది అర్థం కావట్లేదు అని విచారం వ్యక్తం చేశారు..రైతు వ్యవసాయం కోసం వెచ్చించాల్సిన సమయం, వ్యవసాయ క్షేత్రంలో శ్రమించాల్సిన రైతుపాదాలు రోడ్ల పైకి వచ్చి నిరసనలు ధర్నాలు రాస్తారోకోలు చేసి అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లలో తిరుగుతున్న దుస్థితికి కారణం అయినా బిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బొంద పెట్టాలని రైతులకు పిలుపు ఇచ్చారు. 24 గంటలు విద్యుత్ ఇవ్వని పక్షంలో రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ తరపున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..నాడు నేడు భవిష్యత్ లో రైతుల బాగు కోసం కృషిచేసే,రైతు హక్కుల కోసం పోరాడే పార్టీ కేవలం కాంగ్రెస్ అని రైతులకు తెలిపారు.ఈ నిరసన పోరు కార్యక్రమంలో మెట్ పల్లి మండలం కిసాన్ సెల్ కాంగ్రెస్ అధ్యక్షులు పిడుగు తిరుపతి రెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పి రెడ్డి అంజిరెడ్డి,మెట్ పల్లి మండలం కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇల్లెందుల రాజు,రైతులు జెడి రవి, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి ప్రశాంత్ కలికోట విజయ్, ఎండి ఉస్మాన్, తప్ప రాజేశ్వర్,పిడుగు రాజారెడ్డి,కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు అందే మారుతి బాపూజీ, బొల్లె మల్లయ్య, జై డి మల్లేశం, డబ్బా రాజారెడ్డి,మానాల లింగ రెడ్డి,తప్ప శ్రీనివాస్, పిడుగు హనుమండ్లు,పాలెపు భూమారాజం,పుప్పాల గంగాధర్, సంజీవ్, నల్ల భూమేష్, మానాల రాజేష్, రాజారపు రాజేందర్
తదితరులు పాల్గొన్నారు