రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ తాసిల్దార్ కు వినతిపత్రం.రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ తాసిల్దార్ కు వినతిపత్రం.
-కల్వకుంట్ల సుజీత్ రావు టిపిసిసి డెలిగేట్ కోరుట్ల నియోజకవర్గం
మల్లాపూర్( జనం సాక్షి) నవంబర్ : 24 భరతమాత కూడలి నుండి తాసిల్తు కార్యాలయం వరకు పెద్ద ఎత్తున రైతుల సమస్యలైన రైతు రుణ మాఫీ , వ్యవసాయ కూలీలకు భీమ , ధరణి పోర్టల్ యందు తాలు తేమ పేరిట వడ్ల తూకములో అదనపు కోత మరియు పోడు రైతుల గురించి కార్యాలయం వరకు పెద్ద ఎత్తున రైతులు ధర్నా తో వెళ్లి తాసిల్దార్ కు వినతిపత్రం కల్వకుంట్ల సుజిత్ రావు అందజేశారు. ఈ సందర్భంగా సుజితరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన రైతు రుణ మాఫి హామిని నెరవేర్చమని అదే విధంగా ధరణి పోర్టల్ రద్దు చేయాలని , వడ్ల తూకములో తాలు , తేమ పేరిట అదనపు కోతలను అదుపు చేయాలని , ధాన్యం తీసుకొని రైస్ మిల్లర్లపై చర్య తీసుకోవాలని అదే విధంగా తె.రా.స ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించగ రానీ కోరారు . ఆయనతోపాటు రుత్త నారాయ టిపిసిసి రాష్ట్ర పిషేర్మెన్ ప్రధాన కార్యదర్శి, మామిడి రాజశేఖర్ రెడ్డి, కల్లేడ గంగాధర్, నావనండి నర్సయ్య ,లోక పతాన్ ,ఇప్పకొల్లి గణేష్ రాజేంధర్ పాల్గోన్నారు.




