రైతు రుణమాఫీకి మోక్షం ఎప్పుడు.
-రైతు ఉసురు తీస్తున్న కేసీఆర్, రైతు బంధు పేరుతో మోసం
-టిడిపి అచ్చంపేట నియోజకవర్గం ఇంచార్జ్ మోపతయ్య.
పదర జనం సాక్షి: రైతు రుణమాఫీ చేస్తామని యావంత్ తెలంగాణ రైతన్నల ఓట్లు దండుకొని, అధికారంలోకి వచ్చిన కెసిఆర్ సీఎం బాధ్యతలు చేపట్టి తొమ్మిదేళ్లు అయినప్పటికీ నేటికీ రైతు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేయడం జరుగుతుందని అచ్చంపేట టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి మోపతయ్య తెలిపారు పదరా మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయకుండా రైతులను తీవ్ర నష్టానికి గురి చేస్తున్నారని వాపోయారు. టిఆర్ఎస్ లో ఉన్న మంత్రులంతా ఇతర పార్టీలకు చెందిన వారని వారు పేర్కొన్నారు త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమన్నారు. టిడిపి పార్టీ హాయంలోనే అన్ని వర్గాల వారికి మేలు జరిగిందని రాజకీయ, విద్య, వైద్య, ఆర్థిక అన్ని రంగాలలో తెలుగుదేశం పార్టీ మేలు చేసిందని వారు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశ పార్టీకి పూర్వ వైభవం త్వరలో వస్తుందని 2023లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు బొడ్డు రాజయ్య యాదవ్, టిడిపి నాయకులు కనుకటి వెంకటయ్య, అంజి, తదితరులు పాల్గొన్నారు
రైతు రుణమాఫీకి మోక్షం ఎప్పుడు.




