Tuesday, 3 November 2026

ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహసభలను విజయవంతం చేయండి

ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహసభలను విజయవంతం చేయండి.ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహసభలను విజయవంతం చేయండి.-ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ
కురవి నవంబర్/30: జనం సాక్షి న్యూస్:ఎస్ఎఫ్ఐ జాతీయ మహసభలని జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పట్ల మధు విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కురవి మండల కమిటీ ఆద్వర్యంలో పొస్టర్  ఆవిష్కరించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలోనే విద్యారంగ సమస్యల మీద రాజి లేని పోరాటాలు చేస్తూ, దేశంలో ప్రతి ఒక్క విద్యార్థికి సమాన విద్య అందించాలని, శాస్త్రీయ విద్యా విధానం కోసం అలుపెరుగని పోరాటం చేస్తుందని అన్నారు.. భారత విద్యార్థి ఫెడరేషన్ అఖిల భారత మహాసభలు తెలంగాణలో జరగడం అభినందనీయమని అన్నారు…. దేశంలో మతోన్మాదాన్ని పెంచేలా కేంద్రం విద్యా రంగాన్ని తయారయచేస్తుంది అన్నారు..నూతన విద్యా విధానం పేరుతో దేశానికి పెను ప్రమాదం ఉంది అన్నారు.దేశం నుండి నలుమూలల రాష్ట్రాల నుండి విద్యార్థి ప్రతినిధులు హాజరు కాబోతున్నారని, భవిష్యత్తు కర్తవ్యాలు , తీర్మానాలు చేసుకొని ఉద్యమా రూపకల్పన కోసం ఈ మహాసభలు జరుగుతున్నాయని అన్నారు.. ఈ సందర్భంగా మహాసభలు జయప్రదం చేయాలని అన్నారు …ఈ సందర్భంగా జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు…. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి గందసిరి జ్యోతి బసు,మండల అధ్యక్ష, కార్యదర్శులు వీరెందర్,మురళి,మండల నాయకులు మౌలానా ,మహేష్,నవీన్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.