రైతు వ్యతిరేకర్ ప్రభుత్వాన్ని గద్దించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
భైంసా రూరల్ జూలై12 జనం సాక్షి : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం మేరకు ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆనందరావుపటేల్ నాయకత్వంలో భైంసా పట్టణంలోని సబ్స్టేషన్ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దహనం చేసి, రోడ్డుపైన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ప్రారంభించిన విషయం టిఆర్ఎస్ నాయకులకు గుర్తుండాలని, మేము రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు పని చేస్తామని,రైతులను తప్ప దోవ పట్టించడానికే కేటీఆర్ ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారనీ, బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుంది. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుందని, తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్ అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భైంసా పట్టణ అధ్యక్షులు నడమిశెట్టి భూమన్న, బైంసా రూరల్ అధ్యక్షులు సాయినాథ్ పటేల్ హైమత్ సాబ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రామ్నాథ్ నాయక్, రాజేశ్వర్ కామ్లే భగవాన్ పటేల్ తనూరు మండల్ వైస్ ప్రెసిడెంట్ నాకిడి నవీన్ రమేష్ బైంసా మండల్ ప్రెసిడెంట్ పైసల్ మొహమ్మద్ అఫ్జల్ ముత్యం తదితరు పాల్గొన్నారు.