రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ తొలి ప్రాధాన్యం
రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వందేళ్ల క్రితం నాటి జాగీర్దార్ కాలువకు పునరుజ్జీవం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (31): గోపాల్ పేట మండల పరిధిలోని బుద్దారం శివారులో శనివారం జాగీర్దార్ కాల్వకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4.5 కిలోమీటర్ల జాగీర్దార్ కాలువ కింద నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది అన్నారు కాలువ కింద భూమి కోల్పోయిన రైతులందరికీ త్వరలో పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అన్నారు జాగీర్దార్ కాలువతో మండలంలోని బుద్దారం, పొలికెపాడు, చెన్నూరు గ్రామాలు, నాలుగు తండాలకు గోపాల్ పేట శివారు రైతులకు లబ్ది చెందుతుందన్నారు కాలువ పక్కన ఉన్న రైతులు కాలువ కోసం కేటాయించిన భూమిని సాగు చేయొద్దు అని రైతులకు సూచించారు ఎత్తయిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళికతో సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయని అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి తొలి ప్రాధాన్యత ఇచ్చి రైతుబంధు, రైతు బీమా 24 గంటల ఉచిత కరెంటు పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రాకతో గ్రామాలకు వలసలు తిరుగు ముఖం పట్టాయని ఎనిమిది ఏళ్లలో తెలంగాణ గ్రామాలలో మార్పు మొదలైందని భవిష్యత్తులో దేశానికి తెలంగాణ దిక్సూచి లా నిలుస్తుంది అని అన్నారు చుట్టూ నీరున్న నీరు అందుకు రైతులు నిరాశ చెందారని అలాంటి రైతుల విజ్ఞప్తి మేరకు అడివిలో నీటిని అడ్డుకట్ట వేసి నీటిని మళ్లింపు చేయడం జరుగుతుంది అన్నారు అనంతరం మంత్రి రైతుబంధు, రైతు బీమా పథకం, సాగునీటి పరిస్థితులపై రైతులతో వేరుశెనగ పొలంలో మంత్రి ముచ్చటించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మంద భార్గవి కోటీశ్వర్ రెడ్డి, ఎంపీపీ సంధ్య తిరుపతయ్య యాదవ్, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, డిప్యూటీ తహసిల్దార్ షాకీర్ హుస్సేన్, కో ఆప్షన్ సభ్యులు మతిన్, అన్ని గ్రామాల ఎంపిటిసిలు, సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచులు, శ్రీనివాసులు, పద్మమ్మ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గాజుల కోదండం, పార్టీ నాయకులు రాజేష్ గౌడ్, రాజేష్ చారి, నాగరాజు, శివకుమార్, లాలు నాయక్, తది తరులు పాల్గొన్నారు.




