Monday, 2 November 2026

న్యూ ఇయర్ వేడుకలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

న్యూ ఇయర్ వేడుకలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

సబ్ ఇన్స్పెక్టర్ నవీద్

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (31): న్యూ ఇయర్ వేడుకలను నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని గోపాల్ పేట్ సబ్ ఇన్స్పెక్టర్ నవీద్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సిఐ ప్రవీణ్ కుమార్ సూచన మేరకు శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం మండల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.మద్యం సేవించి వాహనాలు నడిపినచో, రోడ్డుమీద డీజేలో సౌండ్ సిస్టములు పెట్టకూడదని ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ జరుపుకోవాలని,ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దు అని అన్నారు. రోడ్డు పై కేక్ కటింగ్, ఓపెన్ డ్రింకింగ్ చేయకూడదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బైక్ సైలెన్సర్ లు మార్చు కోవాలని,ర్యాష్ డ్రైవింగ్, మైనర్ లు వాహనాలు నడపరాదని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గోపాల్ పేట్ మండల ప్రజలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.