Wednesday, 4 November 2026

రైతు సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది -జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

బజార్ హత్నూర్ (జనం సాక్షి ) : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటుచేసిన రైతు దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని దేశానికి అన్నం పెట్టేది రైతు అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు నకిలీ విత్తనాలకు తావివ్వకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు సూచనలు అందించాలని అన్నారు మండలంలోని ఆరు క్లస్టర్లలోని రైతు వేదికల భవనాలలో రైతు దినోత్సవ కార్యక్రమాలను తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా రైతులకు వడ్డన చేశారు దేగామ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమాలలో తాసిల్దార్ సోము ఎంపీడీవో రాథోడ్ రాధా స్థానిక సర్పంచ్ పరచ లావణ్య ఉప సర్పంచ్ విలాస్ ఎంపీటీసీ తిరుమల వ్యవసాయాధికారి ప్రమోద్ రెడ్డి ఎంపీ ఓ మహేందర్ రెడ్డి జడ్పిటిసి మల్లెపూల నరసయ్య ఎంపీపీ జయశ్రీ సహకార సంఘ చైర్మన్ మేకల వెంకన్న ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మండల నాయకులు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.