Tuesday, 3 November 2026

రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన

రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన
– ధరణి పోర్టల్ని వెంటనే రద్దు చేయాలి
– ఏకకాలంలో రైతులకు రుణమాఫీని చెల్లించాలి – కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు హుజూర్ నగర్ నవంబర్ 30 (జనంసాక్షి): నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యల మీద హుజూర్ నగర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున రావు అధ్యక్షతన బుధవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ధర్నా, నిరసన నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్డీవో కి మెమరాండం ఇవ్వటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పట్టణ రైతు సంఘం అధ్యక్షులు పులిచింతల అంజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాల నుండి కె.సి.ఆర్ ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూపుతుందని, ఎలక్షన్లో ఇచ్చినటువంటి వాగ్దానం లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయకుండా రైతులను మోసం చేస్తుందని అన్నారు. రైతులకు లాభం చేకూరుస్తుందని తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ ప్రతి చిన్న కారు రైతుకు అనేక సమస్యలు కొనితెచ్చిపెడుతుందని, ధరణి పోర్టల్ ని వెంటనే రద్దు చేయాలన్నారు. తెలంగాణలో రైతులకు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాలకు పంట నష్టపరిహారం అందించడం లేదని, రైతుబంధు చిన్న సన్నకారు రైతుల కన్నా బడా భూస్వాములకే మేలు జరుగుతుందని, రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర చెల్లిస్తే ఏ రైతు కూడా రైతు బంధు కోసం ఎదురు చూడడని అన్నారు. రైతుబంధు పేరుతో 5000 రూపాయలు చెల్లిస్తూ పంటలకు అవసరమైనటువంటి ఎరువులు, పెస్టిసైడ్స్ ధరలను తెలంగాణ ప్రభుత్వం విపరీతంగా పెంచారన్నారు. గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల చాలామంది కౌలు రైతులు బలన్మరణం చేసుకునేటువంటి పరిస్థితులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయని, కెసిఆర్ ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా గాని ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తున్నారని అన్నారు. కె.సి.ఆర్ కి ఓట్లు తప్ప ప్రజల యొక్క బాగోగులకు అవసరం లేదని, కె.సి.ఆర్ చేస్తున్నటువంటి మోసాలను తెలంగాణ ప్రజానికం, రైతాంగం నిరుద్యోగులు, మహిళలు నిచితంగా గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ తెలియజేసినటువంటి సమస్యల మీద స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి కె.సి.ఆర్ ని గద్దె దింపటం ఖాయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, సీనియర్ నాయకులు సాములు శివారెడ్డి, పి.సి.సి సభ్యులు దొంగరి వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ముఖ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కాస్తల శ్రవణ్ కుమార్, గరిడేపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, మఠంపల్లి మండల అధ్యక్షులు, వర్కింగ్ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, భూక్య మంజు నాయక్, నంది రెడ్డి ఇంద్రారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాచి మంచి గిరిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు ఎడవల్లి వీరబాబు, జక్కుల మల్లయ్య, గొట్టేముక్కుల రాములు, ఎంపీటీసీ సభ్యులు బాల్దూరి సందీప్, మచ్చ వెంకటేశ్వర్లు, పరమేష్, మున్సిపల్ కౌన్సిలర్ కోతిసంపత్ రెడ్డి, కాల్వపల్లి తండా సర్పంచ్ సక్రు నాయక్, జిల్లా కార్యదర్శి చాందిమియా, మహిళా నాయకురాలు ఇంటి అచ్చమ్మ, బొప్పనిలక్ష్మి, మఠంపల్లి మండల మైనార్టీ నాయకులు నాగులు మీరా, ఐ ఎన్ టి యు సి నాయకులు బెల్లంకొండ గురవయ్య గౌడ్, మేళ్లచెరువు ముక్కంటి, చింతకాయల రాము, కస్తాల రవీందర్, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు అంజనపల్లి సుదర్శన్, హుజూర్ నగర్ వార్డు కమిటీల అధ్యక్షులు ముషం సత్యనారాయణ, సమ్మెట సుబ్బరాజు, కంకణాల పుల్లయ్య, ఇట్టి మల్ల బెంజిమెన్, పోతుల జ్ఞానయ్య, దాసరి పున్నయ్య, బంటు సైదులు, దొంతగాని జగన్, తేప్పని ఎలమంద, షేక్ ఫరీద్, కందుకూరి రాము, గడ్డం అంజి, ఎక్స్ ఎం.పీ పీ ఇరిగాల లక్ష్మీ రామకృష్ణారెడ్డి, రైతు సంఘం నాయకులు భోగాల పిచ్చిరెడ్డి, వల్లపు దాసు దుర్గయ్య గౌడ్, రౌతు అంతయ్య, అన్నపురెడ్డి వెంకటరెడ్డి, ఏ. గోవిందరెడ్డి, ఎం. వెంకటేశ్వర్ రెడ్డి, జినిగల వెంకటేశ్వర్లు, పి.పుల్లారెడ్డి, ఏ. చిన్నపురెడ్డి, వెంకటేశ్వర్లు, రవీందర్, కుక్కడపు వీరబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.