Wednesday, 4 November 2026

రైతు సమస్యలపై రాజీ లేని పోరాటం : చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రైతు సమస్యలపై గస్‌పార్క్‌ వద్ద తెదేపా చేపట్టిన ధర్నాలో చంద్రబాబు పాల్గొన్నారు. రైతు సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కౌలు రైతులకు రుణ సహాయం అందట్లేదని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 23 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *