Wednesday, 4 November 2026

రైతే రాజు ఎమ్మెల్యే హన్మంత్ షిండే

 

 

 

 

 

 

 

బిచ్కుంద ఏప్రిల్ 18 (జనంసాక్షి)రైతును రాజులాగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మంగళవారం నాడు ఆయన పలు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. వాజిద్ నగర్, పుల్కల్, బండారెంజల్, గుండెనెమ్లి తదితర గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో నాల్చర్ రాజు, నాగ్నాథ్ పటేల్, బస్వరాజ్ పటేల్, ఎంపీపీ అశోక్, సిద్ధిరాం పటేల్, వెంకట్రావు దేశాయ్, నాల్చర్ బాలు, యాదవ్, ఆకుల సాయిలు, కృష్ణా రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.