హైదరాబాద్: నాపంల్లి రైల్వేస్టేషన్లోని రైలు బోగీలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు వ్యక్తిని హత్యచేసి మృతదేహాన్ని ఖాళీ బోగీలో పడేసినట్లు భావిస్తున్నారు. ఘటనపై నాంపల్లి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి వివరాలను రైల్వే పోలీసులు సేకరిస్తున్నారు.