న్యూఢిల్లీ: ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సేవలను మరింత క్రమబద్దికరణ చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. క్రెడిట్, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాలు లేనివారు కూడా ఐఎంపీఎన్ వ్వవస్థలో అన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవర్చని శుక్రవారం రైల్యే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఇంటర్ బ్యాంక్ మొబైల్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) ను అందుబాటులోకి తేనుంది. ప్రాధమిక స్థాయిలో టికెట్ల బుకింగ్, చెల్లింపులు ఐఆర్‌సీటీసీ ఈ-టికెట్ వెబ్‌సైట్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొబైల& ద్వారా చేసుకునే సదుపాయాన్నీ తీసుకురానున్నారు. 24 గంటలు అందుబాటులో ఉండటం ఈ కొత్త విధానంలో మరో విశేషమని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.




